బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) కి చంపేస్తామంటూ బెదిరింపు కాల్ రావడం సంచలనంగా మారింది. ఇప్పటికే మరో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కి కొంతకాలంగా బెదిరింపులు వస్తుండగా, ఇప్పుడు ఆ లిస్టులో షారుఖ్ కూడా చేరాడు. ఆయనకు కాల్ చేసి చంపేస్తామని బెదిరించడమే కాకుండా, కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ బెదిరింపు కాల్ కి సంబంధించి మహారాష్ట్రలోని బాంద్రా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ప్రాధమిక దర్యాప్తులో.. ఫోన్ చేసి బెదిరించిన వ్యక్తిని ఛత్తీస్‌గఢ్ కి చెందిన ఫైజాన్ గా గుర్తించినట్లు సమాచారం. ఇది ఆకతాయిగా చేసిన పనా లేక దీని వెనక ఏదైనా కుట్ర కోణం దాగుందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బెదిరింపు కాల్స్ నేపథ్యంలో షారుఖ్ ఇంటి వద్ద భద్రత పెంచారు.